శని త్రయోదశి

శని త్రయోదశి

శనివారం త్రయోదశి కలిసి వస్తే..శని త్రయోదశి  అంటారు. 

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి మరియు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, 
స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, 

ఇతర పేర్లు..
  • కృషాణు, 
  • శౌరి, 
  • బభ్రు, 
  • రోద్రాంతక, 
  • సూర్యపుత్ర,  
కాశ్యపన గోత్రం. 

నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . 

శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. 

మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. 

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది.

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాడు.. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , 
శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు.. నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు,  నీలపు శంఖు పుష్పములు, 
నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తున్నానని తెలిపాడు. 

ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. 

శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా 
ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారంన త్రయోదశి రోజు .
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

  1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
  2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
  3. వీలైన వారు శివార్చన స్వయముగా చేయటము.
  4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
  5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
  6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు), ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
  7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోకుండా వుండటం చేయాలి.
శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు.

“నీలాంజన సమాభాసం,  రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం”

|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

శని గాయత్రీ మంత్రం
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో ఛాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం.

ఓం నమో శనీశ్వరయై నమః..!!

Comments

Popular posts from this blog

Vinayaka Vrata Kalpam

Meaning of Krishna