Posts

Showing posts from July, 2020

శని త్రయోదశి

శని త్రయోదశి శనివారం త్రయోదశి కలిసి వస్తే..శని త్రయోదశి  అంటారు.  నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి మరియు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున,  స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు,  ఇతర పేర్లు.. కృషాణు,  శౌరి,  బభ్రు,  రోద్రాంతక,  సూర్యపుత్ర,   కాశ్యపన గోత్రం.  నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు .  శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం.  మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.  శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది. సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాడు.. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు ,  శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు న...